గుడికట్టు పండుగ విషయంలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి అనంతపురం రూరల్ మండలం చియేడులో ఓ వర్గానికి చెందిన యువకుడు పోలీసుల ఎదుటే స్టూల్‌పై పెట్రోల్ పోసుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది.
రెండు వర్గాల మధ్య ఘర్షణ
పోలీసుల ఎదుటే పెట్రోల్ పోసుకున్న యువకుడు
తపోవనం(అనంత రూరల్) : గుడికట్టు ఉత్సవం సందర్భంగా రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ వివాదానికి దారితీసింది. ఈ ఘటనకు సంబంధించి అనంతపురం రూరల్ మండలం చియేడులో ఓ వర్గానికి చెందిన యువకుడు పోలీసుల ఎదుటే స్టూల్‌పై పెట్రోల్ పోసుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది.
పోలీసులు రంగప్రవేశం చేసి ఆస్పత్రికి తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది. అనంతపురం నగరంలో ఆదివారం కురుబాల గుడికట్టు ఉత్సవం జరగనుంది. స్వామివారి పేరు మార్పిడి, ఊరేగింపు విషయంలో స్థానిక కురుబలకు చెందిన రెండు వర్గాల మధ్య నాలుగేళ్లుగా వివాదం నడుస్తోంది.
దీనిపై ఓ వర్గం హైకోర్టును ఆశ్రయించింది. పేరు మార్పు విషయంలో తుది నిర్ణయానికి రాకపోవడంతో.. పేరు ఉచ్ఛరించకుండా ఊరేగింపు మాత్రమే నిర్వహించాలని పోలీసులు ఆదేశించారు.
ఈ మేరకు ఆ సమయంలో పోలీసుల మధ్య ఊరేగింపు నిర్వహించారు. ప్రస్తుతం గుడికట్టు ఉత్సవాలకు స్వామిని ఊరేగింపుగా తీసుకెళ్లే విషయంలో పూజారి ఓ వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మరో వర్గం వాగ్వాదానికి దిగింది.
సమాచారం లేకుండా స్వామివారిని అలంకరించి ఊరేగిస్తే ఎలా అని గవ్వల వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
తమకు న్యాయం చేయాలని కోరుతూ ఓ వర్గానికి చెందిన రాము అనే యువకుడు తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అక్కడే ఉన్న పోలీసులు అతడిపై నీళ్లు చల్లి పరిస్థితిని చక్కదిద్దారు.
శతాబ్దాల చరిత్ర కలిగిన చియేడు దుర్గమప్ప స్వామి ఆలయంలో రెండు వంశాలు పూజలు అందుకుంటున్నాయి. నలుగురు వ్యక్తులు ఆలయ సమస్యను సృష్టించి హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు పరిధిలోని ఈ వ్యవహారాన్ని స్థానిక ఎమ్మెల్యే, పోలీసులు రాజకీయ కోణంలో చూడటం గవ్వల, చిత్ర కులస్తుల మధ్య చిచ్చు రేపుతోంది.
Discussion about this post