విశ్వవిద్యాలయాల్లో ఆచార్య, సహాయచార్య ఉద్యోగాల భర్తీకి అక్టోబరు 31వ తేదీన ప్రకటన వెలువడింది. ఈనెల 1 నుంచి 20 వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి గడువు ఇచ్చారు. కానీ, దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు.
ఎడిట్‌కు అవకాశంలేక ఆందోళనలో అభ్యర్థులు
ఇప్పటికే న్యాయపర చిక్కులతో నియామకాల్లో జాప్యం
ఎస్కేయూ: విశ్వవిద్యాలయాల్లో ఆచార్య, సహాయాచార్య ఉద్యోగాల భర్తీకి అక్టోబరు 31వ తేదీన ప్రకటన వెలువడింది. ఈనెల 1 నుంచి 20 వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి గడువు ఇచ్చారు. కానీ, దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు.
రూ.2500 రుసుం చెల్లించాలని నిర్ణయించారు. దరఖాస్తు ప్రక్రియ ఆరంభమైనప్పుడు 4 రోజులపాటు ఆన్‌లైన్‌లో ఫీజు స్వీకరించలేదు. మొదటి వారంలో అభ్యర్థులు దరఖాస్తు చేయలేని పరిస్థితి. ఫీజు చెల్లించిన తరువాత ఎడిట్ అవకాశం లేదు. చిన్న పొరపాటు చేసినా సరిదిద్దుకోలేని పరిస్థితి.
మరికొందరు అభ్యర్థులు మొదట నమోదు చేసిన వివరాల్లో ఏదైనా సరిచేయడానికి వెనక్కి వస్తే వివరాలు సేవ్ కావడం లేదు. దీంతో అభ్యర్థులు అయోమయంలో ఉన్నారు. పొరపాట్లు సరిరిద్దుకోడానికి వెసులుబాటు లేదని కొందరు అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
డిసెంబరు 18 నుంచి 23 వరకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. పరీక్ష తేదీ వెలువడింది. ఇప్పటికీ చాలా సందేహాలున్నాయి. 18 సంవత్సరాల తరువాత పక్కాగా నియామకాలు జరుగుతాయని అభ్యర్థులు భావించారు.
కానీ, వివరాల నమోదులో చిన్న పొరపాట్లు చేసిన అభ్యర్థులు ఏన్నో ఏళ్ల తరువాత వచ్చిన అవకాశం కోల్పోతామేమోనని ఆందోళనలో ఉన్నారు.
మహిళా అభ్యర్థులకు కేటాయించాల్సిన పోస్టుల వివరాలు ప్రకటనలో లేకపోవడం, న్యాయస్థానంలో వ్యాజ్యం తదితర కారణాలతో ఉద్యోగాల భర్తీపై సందేహం నెలకొంది. 2008, 2018 సంవత్సరాల్లో వర్సిటీల్లో సహాయాచార్యుల నియామకానికి ప్రకటన వెలువడింది. న్యాయపరమైన చిక్కుల కారణంగా ఇప్పటికీ భర్తీకి నోచుకోలేదు.
నీ 2018లో అభ్యర్థులు స్క్రీనింగ్ టెస్ట్ కూడా రాశారు. ఇప్పటికీ ఫలితాలు వెల్లడించలేదు. ఆ నోటిఫికేషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ప్రస్తుత ప్రకటనపై కూడా హైకోర్టులో వివాదం నడుస్తోంది. దీంతో ఈ మొత్తం ప్రక్రియలో గందరగోళం నెలకొంది.
జేఎన్‌టీయూకు 1,680 దరఖాస్తులు
అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసినా, ఆ దరఖాస్తు జిరాక్స్, సర్టిఫికెట్లు ఆయా విశ్వవిద్యాలయానికి సమర్పించాల్సి ఉంటుంది. 27లోపు వాటిని విశ్వవిద్యాలయాలకు సమర్పించాలి. ఇప్పటికే జేఎన్‌టీయూకు 1,680 దరఖాస్తులు వచ్చాయి.
దరఖాస్తులను 30 లోపు పరిశీలించి, అనర్హత దరఖాస్తులను విశ్వవిద్యాలయాల్లో ప్రదర్శిస్తారు. అభ్యర్థుల నుంచి డిసెంబరు 7 వరకూ వినతులు స్వీకరించి 8న స్క్రీనింగ్ టెస్ట్‌కు అర్హత ఉన్న అభ్యర్థులను ప్రకటిస్తారు. 20 వరకూ దరఖాస్తుకు గడువుంది.
27 వరకూ మరిన్ని దరఖాస్తులు వర్సిటీలకు చేరతాయి. జేఎన్‌టీయూలో వచ్చిన దరఖాస్తులను తక్కువ సమయంలో ఎలా పరిశీలించాలోనని సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు.
సమస్యలుంటే వినతులు పంపవచ్చు
ఇప్పటికి రాష్ట్రవ్యాప్తంగా 30 వేల దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు చేయడానికి సమస్యలున్నట్లు దృష్టికి రాలేదు. ఒకవేళ సమస్యలు తలెత్తితే ఆన్‌లైన్‌లో వినతులు పంపించవచ్చు. వాటికి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం.
Discussion about this post