తాజాగా పట్టణంలోని ఓ చిట్‌ఫండ్ కంపెనీ నిర్వాహకుడు చిట్ సొమ్ము చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
రాయదుర్గం పట్టణం: పట్టణంలోని ఓ చిట్‌ఫండ్ కంపెనీ నిర్వాహకుడు చిట్ సొమ్ము చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. టీచర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి బినామీ పేరుతో చిట్ ఫండ్ కంపెనీ నడుపుతున్నాడు.
తనకున్న సంబంధాలతో చాలా మందిని నమ్ముతాడు. కొందరు వ్యాపారులు, ఉద్యోగులు అతడిని నమ్మి నగదు చెల్లించారు. చిట్ గడువు ముగిసినా నగదు చెల్లించకపోవడంతో కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాయదుర్గంతోపాటు బళ్లారి, కళ్యాణదుర్గంలో చిట్ ఫండ్ కంపెనీలు నెలకొల్పి బళ్లారిలోని కార్యాలయాన్ని మూసివేశారు.
గతంలో కూడా పట్టణానికి చెందిన ఓ వ్యాపారికి చిట్ మొత్తం ఇవ్వలేదని, కార్యాలయానికి వెళ్లి వాగ్వాదానికి దిగితే తప్ప నగదు చెల్లించలేదని బాధితుడు వాపోయాడు.
Discussion about this post