జగన్‌మోహన్‌రెడ్డి చేసిన సాయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి. జగన్ ఉన్నన్ని రోజులూ మహిళల కళ్లల్లో కన్నీళ్లు రాకుండా చూసుకుంటారు. ఇంత భరోసా కల్పిస్తున్న నాయకుడిని మళ్లీ ఆశీర్వదించాలి. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. గత ఎన్నికల్లో రాప్తాడులో 25 వేల ఓట్ల మెజార్టీతో మీ బిడ్డ తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిని గెలిపించారు. ఈసారి కూడా మంచి మనసుతో బంపర్ మెజార్టీతో గెలిపించాలి’’ అని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. శనివారం రాప్తాడు ఎంపీడీఓ కార్యాలయంలో మహిళలకు ఇంటిపట్టాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా 1003 మంది మహిళలకు పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రిజిస్ట్రేషన్‌కు లబ్ధిదారులకు రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వమే భరిస్తోంది.
👉ఇళ్ల పట్టాల పేరుతో వైఎస్ జగనన్న రాష్ట్రవ్యాప్తంగా అక్కచెల్లెమ్మలకు లక్ష కోట్ల విలువైన ఆస్తులు పంపిణీ చేశారు. గతంలో ఏ ప్రభుత్వమైనా ఈస్థాయిలో ఆస్తి పత్రాలు పంపిణీ చేసిందా?. అని ఎమ్మెల్యే అడగగా ఏ ప్రభుత్వమూ ఇవ్వలేదని మహిళలు అన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడపడుచునూ తన సొంత అక్కచెల్లెమ్మలుగా భావించాడు కబాట్టే 31 లక్షల మంది మహిళలకు ఇంటిపట్టాలు మంజూరు చేశారు. 22 లక్షల మందికి పక్కా ఇళ్లు మంజూరు చేశారు.
👉గతంలో ఏ ముఖ్యమంత్రి మహిళల కోసం ఈస్థాయిలో ఆలోచన చేయలేదు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామంటూ ఓట్లు వేయించుకుని గద్దెనెక్కిన తర్వాత పట్టించుకోని చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రిని చూశాం. మహిళలను కేవలం ఓటుబ్యాంకుగా మాత్రమే చూశారు. ఏదైనా సభలు పెడితే బస్సుల్లో మహిళలను పిలుచుకెళ్లి అక్కడ కుర్చీలను నింపేందుకు ఉపయోగించుకున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చిన తర్వాత సమాజంలో గౌరవం పెంచేలా చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే ప్రతి స్కీమూ మహిళల పేరుతో అమలు చేస్తున్నారు.
👉‘అమ్మ ఒడి’ పథకం ద్వారా పిల్లల చదువులకు 50 లక్షల మంది తల్లుల ఖాతాల్లో 30 వేల కోట్ల రూపాయలు జమ చేశారు. 45 ఏళ్లు దాటిన అక్కచెల్లెమ్మలు ‘చేయూత’ పథకం ద్వారా 31 లక్షల మందికి 14 వేల కోట్ల రూపాయలు జమ చేశారు. విద్యాదీవెన, వసతి దీవెన కింద 11 వేల కోట్ల రూపాయలు చెల్లించారు. 31 లక్షల ఇంటిపట్టాలు మంజూరు చేశారు. 22 లక్షల ఇళ్లు మంజూరు చేశారు. సచివాలయాల ఏర్పాటుతో గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చారు. బ్యాంకుల్లో డ్వాక్రా రుణాలు ఇచ్చేందుకు పరిమితి పెంచుతున్నారు. మీ వెనుక జగన్‌మోహన్‌రెడ్డి డబ్బులు కడతానే ధైర్యంతోనే బ్యాంకర్లు ముందుకు వస్తున్నారు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, చైర్మన్లు, డైరెక్టర్లు, గృహ సారథులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, స్టోర్ డీలర్లు, మండల నాయకులు, కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది మరియు అధికారులు పాల్గొన్నారు..
Discussion about this post