తాడిపత్రి అర్బన్:
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారం మేరకు బుధవారం ఉదయం తాడిపత్రిలోని ఫ్లైఓవర్ వద్ద సీఐ హమీద్ ఖాన్ తన సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు.
అనుమానాస్పదంగా కనిపించిన అస్సాంకు చెందిన ఒమర్ అలీ, దిల్దార్ హుస్సేన్ నుండి 1,080 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్ర వాహనం, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన వారిద్దరూ ధోతిరూరు రోడ్డులో నివాసం ఉంటున్నట్లు గుర్తించారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
Discussion about this post