అనంతపురం:
ఎస్కేయూ వీసీ డాక్టర్ మాచిరెడ్డి రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ జీవవైవిధ్యం, పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం మన సంస్కృతిలో భాగమన్నారు. యూనివర్సిటీ ఎస్టేట్ ఆఫీసర్ ప్రొఫెసర్ బి.రవిప్రసాదరావు ఆధ్వర్యంలో బుధవారం పాలిమర్ సెమినార్ హాల్‌లో ‘సంస్కృతి, జీవవైవిధ్యం’ అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
జీవవైవిధ్యాన్ని పెంచేందుకు సృజనాత్మక ఆవిష్కరణలు అవసరం. జీవ వైవిధ్యం లేనిదే సృష్టి లేదని స్వతంత్ర ఆహార శాస్త్రవేత్త పద్మశ్రీ డా.ఖాదర్వలి అన్నారు. భగవంతుడు మనకు ఇచ్చిన అద్భుతమైన చెట్లలో రావి ఒకటి. రావి చెట్టు జ్ఞానాన్నంతా నిక్షిప్తం చేసిందన్నారు.
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎ. కృష్ణకుమారి, ప్రగతి గ్రూప్ మేనేజర్లు డాక్టర్ జి. బాలకోటేశ్వరరావు, బోటనీ మాజీ ప్రొఫెసర్ పుల్లయ్య, యోగి వేమన యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎ. మధుసూదన్ రెడ్డి, డాక్టర్ ఎన్ చంద్రమోహన్ రెడ్డి, ప్రొఫెసర్ జివి రమణ, ప్రొఫెసర్ జి. నరసింహన్, డా. మురళీధర్ రావు, డాక్టర్ సంధ్యారాణి పాల్గొన్నారు.
Discussion about this post