అనంతపురం అర్బన్:
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ట్రాన్స్‌జెండర్లు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఎం.గౌతమి పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రాన్స్‌జెండర్లకు గుర్తింపు కార్డులు, ధ్రువీకరణ పత్రాలను ఆమె పంపిణీ చేశారు.
విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆ శాఖ ఏడీ రసూల్, ట్రాన్స్ జెండర్లు శ్రావణి, గోపిక, మధు తదితరులు పాల్గొన్నారు.
సంకల్ప యాత్ర జయప్రదం చేయాలని కోరుతున్నాం:
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వికాసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కలెక్టర్ ఎం.గౌతమి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో సంకల్ప యాత్ర నిర్వహణపై అధికారులతో ఆమె సమీక్షించారు.
ఈ నెల 26 నుంచి 60 రోజుల పాటు సంకల్ప యాత్ర చేపట్టనున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో సీపీఓ అశోక్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయ అధికారిణి ఉమామహేశ్వరమ్మ, మెప్మా పీడీ విజయలక్ష్మి, డీపీఓ ప్రభాకరరావు, ఎల్‌డీఎం సత్యరాజ్, డీఎస్‌వో శోభారాణి, డీటీసీ వీర్రాజు, మున్సిపల్ కమిషనర్ భాగ్యలక్ష్మి, పీఆర్‌ఎస్‌ఈ భాగ్యరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్‌ఈ ఎహషాన్‌బాషా, డీఎంహెచ్‌వో భ్రమరాంబ పాల్గొన్నారు. దేవి, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ నాగరాజు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Discussion about this post