అనంతపురం టవర్ క్లాక్:
జిల్లా నుంచి పలువురు క్రీడాకారులు జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో జిల్లాకు చెందిన భవిష్య, యశస్విని బంగారు పతకాలు సాధించి ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు.
అలాగే గుజ్జల యోగాచర్విత అన్నమయ జిల్లా రైల్వే కోడూరులో జరిగిన ఏపీ స్కూల్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించి డిసెంబర్‌లో మధ్యప్రదేశ్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది.
ఎంపికైన క్రీడాకారులను అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, డిప్యూటీ మేయర్ వాసంతి సాహితి గురువారం అభినందించారు. కార్యక్రమంలో తెనాలిలో జరిగిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో రజత పతకాలు సాధించిన కోచ్‌లు శ్రీకాంత్, రామాంజి, జి.షామిలి, ఎస్‌ఎం.అఫ్రీన్, ఫర్హత్ పాల్గొన్నారు.
Discussion about this post