పొలాల్లో రైతులు వినియోగించే డ్రిప్ పరికరాలను చోరీకి పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను శనివారం కూడేరు ఎస్‌ఐ సత్యనారాయణ అరెస్టు చేశారు. మండలంలోని కొర్రకోడులో ఇటీవల జరిగిన మరో ఘటనలో దుండగులు సాగు సామగ్రిని అపహరించారు.
బాధిత రైతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం అదే గ్రామానికి చెందిన ఎర్రిస్వామి, తిరుపాల్‌లను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి మొత్తం 46 స్ప్రింక్లర్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నారు.
Discussion about this post