హమాస్ చేతిలో ఉన్న 77 ఏళ్ల ఇజ్రాయెల్ మహిళ హన్నా, బందీల విడుదలకు ఒప్పందం కుదిరిన కొన్ని గంటల తర్వాత మరణించింది.
గాజా: హమాస్ నిర్బంధంలో ఉన్న 77 ఏళ్ల ఇజ్రాయెల్ మహిళ హన్నా బందీల విడుదలకు ఒప్పందం కుదిరిన కొద్ది గంటలకే మరణించింది. ఈ విషయాన్ని పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ గ్రూప్ ఒక ప్రకటనలో వెల్లడించింది. హన్నా కట్జిర్ మరియు ఆమె కొడుకును అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయెల్‌లోని నిర్ ఓజ్ నుండి హమాస్ కిడ్నాప్ చేశారు.
తర్వాత వారిని గాజాకు తీసుకెళ్లి జైలులో ఉంచారు. తాజాగా హన్నా వీడియోను హమాస్ విడుదల చేసింది. “ఆమె అనారోగ్యంతో ఉంది. మానవతా దృక్పథంతో ఆమెను విడుదల చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కానీ శత్రువులు అందుకు అంగీకరించలేదు” అని హమాస్ తెలిపింది.
కాల్పుల విరమణను స్వాగతించారు: జో బిడెన్
కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తెలిపారు. హమాస్ చేతిలో బందీలుగా ఉన్న వారి విడుదలకు కుదిరిన ఒప్పందాన్ని నేను స్వాగతిస్తున్నాను.
ఈ ఒప్పందం అమలైతే.. అంతులేని వేదనకు గురైన వారు మళ్లీ వారి కుటుంబాలతో కలిసిపోతారు’’ అని బిడెన్ అన్నారు.ఈ ఒప్పందం కుదరడం వెనుక కీలక పాత్ర పోషించిన ఖతార్, ఈజిప్ట్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.
Discussion about this post