ప్రశాంతి నిలయం విద్యుత్తు కాంతులతో దివ్యతేజోమయంగా విరాజిల్లుతోంది. సత్యసాయిబాబా జయంతి వేడుకలను పురస్కరించుకుని మందిరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. వివిధ ఆకృతుల్లో ఏర్పాటు చేసిన ద్వారాలు, విగ్రహాలు, పుష్పాలు భక్తులు, పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తున్నాయి.

సత్యసాయి నివాస మందిరం యజుర్వేద మందిరం, ఉత్తర గోపురం, ప్రధాన ద్వారం, వినాయక మందిరం, ప్రశాంతి నిలయంలో వివిధ ఆకృతుల్లో ఏర్పాటు చేసిన విద్యుత్తు కాంతులతో విరాజిల్లుతున్నాయి. దేశ, విదేశీ భక్తుల సాయి నామస్మరణతో పుట్టపర్తి మార్మోగుతోంది.
ఏ నోట విన్నా.. సాయి నామస్మరణే వినిపిస్తోంది. వేడుకలను తిలకించడానికి వేలాది మంది భక్తులు తరలి వస్తుండటంతో పట్టణంలోని వీధులు కిటకిటలాడుతున్నాయి. తరలి వచ్చే భక్తులకు వివిధ రాష్ట్రాలకు చెందిన సేవాదళ్ సభ్యులు ప్రేమతో సేవలందిస్తున్నారు.
ప్రశాంతి నిలయంలో భక్తులకు అవరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. భక్తులకు రుచికరమైన భోజనం, తాగునీరు, వసతి సౌకర్యాలు కల్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతి నిలయంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి దేశ, విదేశాలకు చెందిన వైద్యులు సేవలందిస్తున్నారు.
శ్రవణానందంగా సంగీత కచేరి
సత్యసాయిని కీర్తిస్తూ నిర్వహించిన సంగీత గాన కచేరి భక్తులను మంత్రముగ్ధులను చేసింది. సత్యసాయి జయంతి వేడుకల్లో భాగంగా సోమవారం స్థానిక సాయికుల్వంత్ మందిరంలో ప్రముఖ సంగీత విధ్వాంసుడు రాజేశ్ వాయిద్య బృందం అద్భుతంగా సంగీత కచేరి నిర్వహించారు.
భక్తి గీతాలను శ్రావ్యంగా ఆలపించారు. ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ రాజేశ్ వాయిద్య బృందాన్ని ఘనంగా సన్మానించారు. భక్తులు బారులుతీరి మహా సమాధిని దర్శించుకున్నారు.
Discussion about this post