చిన్నారిపై అత్యాచారం కేసులో గాజుల ప్రభాకర్‌కు జీవిత ఖైదు విధిస్తూ అనంతపురం ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి రాజ్యలక్ష్మి తీర్పునిచ్చారు.
2020 మార్చి 25న గుమ్మఘట్ట మండల పరిధిలోని ఓ గ్రామంలో ఆరేళ్ల బాలికపై గాజుల ప్రభాకర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో గుమ్మఘట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
కళ్యాణదుర్గం మాజీ డీఎస్పీ ఎం.వెంకటరమణ ప్రాథమిక విచారణ జరిపి పోక్సో కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు.
సమగ్ర విచారణ అనంతరం నిందితుడి నేరాన్ని నిర్ధారిస్తూ శుక్రవారం న్యాయమూర్తి రాజ్యలక్ష్మి జీవిత ఖైదు తీర్పును వెలువరించారు.
అదనంగా, రూ.5,000 జరిమానాతో పాటు, బాధితురాలికి రూ.3 లక్షల నష్టపరిహారాన్ని కోర్టు ఆదేశించింది.
ఈ మహత్తర కేసులో సాక్షులను హాజరుపరిచి సరైన న్యాయం జరిగేలా కృషి చేసిన మాజీ డీఎస్పీ ఎం.వెంకటరమణ, స్పెషల్ పీపీ విద్యాపతి, ప్రస్తుత కళ్యాణదుర్గం డీఎస్పీ శ్రీనివాసులు, రాయదుర్గం రూరల్ సీఐ యుగంధర్, గుమ్మఘట్ట ఎస్‌ఐ సునీత, కోర్టు కానిస్టేబుల్ నాగార్జున కృషిని ఎస్పీ అన్బురాజన్ అభినందించారు.
Discussion about this post