మడికట్ల ఆంజనేయస్వామి వీధిలో ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బెస్త రామాంజనేయులు (36) అనే యువకుడు మృతి చెందిన సంఘటన పామిడిలో చోటుచేసుకుంది.
మూడు రోజుల క్రితం ప్రమాదం జరగడంతో కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించినప్పటికీ పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతి చెందాడు.
ఆస్పత్రి మార్చురీలో రామాంజనేయులు మృతదేహాన్ని పరిశీలించి వైఎస్‌ఆర్‌సీపీ పట్టణ కన్వీనర్ జోయ్‌జోడ్‌కుమార్, వైస్ కన్వీనర్ శివారెడ్డి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి తదితరులు నివాళులర్పించారు.
బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ప్రోత్సహించడం ద్వారా వారు తమ సహాయాన్ని అందించారు.
Discussion about this post