పెనుకొండ రూరల్‌లో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన చోటుచేసుకుంది.
పెనుకొండ మండలం మరువపల్లికి చెందిన పుష్పలత (30)కు గుత్తూరుకు చెందిన మహేంద్రతో గత పదేళ్ల క్రితం వివాహమైంది.
సంతానం లేదన్న వేదనతో మనస్తాపానికి గురైన ఆమె శనివారం అర్ధరాత్రి తర్వాత ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో ఆదివారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సబ్‌ఇన్‌స్పెక్టర్ రమేష్‌బాబు విచారణ చేపట్టారు.
Discussion about this post