గుంతకల్లు మండల ఆధ్యాత్మిక కేంద్రం కసాపురం. ఇక్కడి నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయాలకు నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. ఆలయ పరిసరాల్లో పరిశుభ్రత లోపించింది.
గుంతకల్లు రూరల్: గుంతకల్లు మండలం కసాపురం ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడి నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయాలకు నలుమూలల నుంచి భక్తులు పోటెత్తారు. ఆలయ పరిసరాల్లో పరిశుభ్రత లోపించింది. మురుగు నీరు తొక్కుతూనే భక్తులు ఆలయానికి వెళ్లాల్సి వస్తోంది.
ఆలయం సమీపంలోని ప్రాథమిక పాఠశాల పక్కనే రోడ్లపై మురుగునీరు ప్రవహిస్తోంది. కాలువ వ్యర్థాలతో నిండిపోవడంతో మురుగునీరు రోడ్లపైకి వస్తోంది. దీంతో వాతావరణం అధ్వానంగా మారి దుర్వాసన వస్తోంది. రెండు రోజుల కిందటే కాలువలో చెత్తను తీసి రోడ్డుపై పడేయడంతో ఆలయానికి వెళ్లే భక్తులు మురుగు కాల్వలో నడవాల్సి వచ్చింది.
కసాపురం పంచాయతీ కార్యదర్శి రామలింగప్పను సమస్యను వివరించాలని కోరగా.. డ్రైన్లు శుభ్రం చేశామని, వ్యర్థాలను తరలించేందుకు ట్రాక్టర్ లేకపోవడంతో జాప్యం జరుగుతోందని, సమస్యను పరిష్కరిస్తామన్నారు.
Discussion about this post