సంక్రాంతి పండుగ సెలవుల సందర్భంగా పెరిగిన ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 12వ తేదీన కాచిగూడ-తిరుపతి మధ్య ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైలును నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి సీహెచ్ రాకేష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రైలు (07041) శుక్రవారం రాత్రి 8:25 గంటలకు కాచిగూడ జంక్షన్ నుండి బయలుదేరి, మరుసటి శనివారం ఉదయం 9:00 గంటలకు తిరుపతి జంక్షన్‌కు చేరుకుంటుంది.
నిర్దేశిత మార్గంలో వాజానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్డు, గద్వాల, రాయచూరు, మంత్రాలయం రోడ్డు, ఆదోని, గుంతకల్లు, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట ఉన్నాయి. ప్రయాణికులు ఈ ప్రత్యేక సేవను వినియోగించుకోవాలని సూచించారు.
Discussion about this post