నాలుగు నెలల గర్భిణి లావణ్య(23) మృతి చెందిన సంఘటన ఆదివారం తనకల్లులో జరిగింది. ఏడాది నుంచి కుటుంబ సభ్యులు అనుమానంతో వేధించడంతో ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
తనకల్లు : నాలుగు నెలల గర్భిణి లావణ్య(23) మృతి చెందిన సంఘటన ఆదివారం తనకల్లులో జరిగింది. ఏడాది నుంచి కుటుంబ సభ్యులు అనుమానంతో వేధించడంతో ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
గుర్తించిన బంధువులు తనకల్లు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలికి భర్త సోమశేఖర్, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం కదిరి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.
వివాహిత తండ్రి చలపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ రాజశేఖర్ వివరించారు.
Discussion about this post