శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థి సంఘాల నాయకులు సోమవారం నిరసన తెలిపారు.
ఏబీవీపీ, ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ తదితర సంఘాలు వేర్వేరుగా నిరసన తెలిపాయి. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఆందోళన చేస్తున్న నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు.
ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహ ప్రతిష్ఠాపనను నిరసిస్తూ విద్యార్థి సంఘాల నాయకులు సోమవారం నిరసన తెలిపారు.
ఏబీవీపీ, ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ తదితర సంఘాలు వేర్వేరుగా నిరసన తెలిపాయి. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఆందోళన చేస్తున్న నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు.
తొలుత ఏబీవీపీ నేతలు వర్సిటీ ప్రవేశ ద్వారాలను మూసివేశారు. ఉద్యోగులను లోపలికి రానీయకుండా అడ్డుకున్నారు. ఏబీవీపీ ఎస్కేయూ అధ్యక్షుడు దివాకర్ నాయక్ మాట్లాడుతూ పేద విద్యార్థుల నుంచి ముక్కుపిండి ఫీజుల రూపంలో వసూలు చేసిన డబ్బుతో రాజకీయ నేతల విగ్రహాలు ఏర్పాటు చేయడం దారుణమన్నారు.
విగ్రహావిష్కరణను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఆందోళన చేస్తున్న ఏబీవీపీ నేతలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో రాజేష్, సుధీర్, సాయి, ప్రతాప్, హరి, బాదాసాబ్ తదితరులు పాల్గొన్నారు.
వైస్ ఛాన్సలర్ తన పదవిని కాపాడుకునేందుకే వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. ఎస్కేయూ ప్రవేశద్వారం వద్ద ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఏ, పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
రాజకీయాల కోసం వైస్సార్సీపీ పదవీ కాలం ముగుస్తున్నందున ముఖ్యమంత్రికి కనువిందు చేసేందుకే రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారని నాయకులు కుళ్లాయిస్వామి, పరమేష్ విమర్శించారు. ఆందోళన చేస్తున్న నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
Discussion about this post