కనగానపల్లి:
44వ జాతీయ రహదారి పక్కన శనివారం ఉదయం మామిళ్లపల్లి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న రామగిరి సీఐ చిన్నగౌస్, కనగానపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
శుక్రవారం రాత్రి 35 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని అక్కడ పడేసి పెట్రోలు పోశారు. సమాచారం అందుకున్న ధర్మవరం డీఎస్పీ శ్రీనివాస్ కూడా అక్కడికి చేరుకుని పరిశీలించారు. సగానికి పైగా శరీర భాగాలు కాలిపోయాయి. సమీప ప్రాంతాలకు ఎలాంటి ఆధారాలు లభించలేదు.
మరో ప్రాంతంలో హత్య చేసి ఇక్కడ పడేసి నిప్పంటించి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహంపై లభ్యమైన ఆనవాళ్లపై దర్యాప్తు చేస్తున్నారు.
Discussion about this post