అనంతపురంలో జిల్లా స్థాయి హ్యాండ్ బాల్ సబ్ జూనియర్ బాలబాలికల జట్ల ఎంపికను జిల్లా కార్యదర్శి ఎస్ .శివశంకర్ ప్రకటించారు. నగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన ఎంపిక ప్రక్రియలో 120 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
గుంటూరు జిల్లా తెనాలిలో ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా నుంచి నిష్ణాతులైన 16 మంది బాలురు, 16 మంది బాలికలు ఎంపికయ్యారు.
Discussion about this post