గుంతకల్లులో మండలంలోని తిమ్మాపురం సమీపంలో పవర్ గ్రిడ్ ఏర్పాటుకు రైతులు సహకరించాలని జాయింట్ కలెక్టర్ కేతంకర్గ్ కోరారు. శనివారం సాయంత్రం గుంతకల్లు ఆర్డీఓ కార్యాలయంలో తిమ్మాపురం, దోనిముక్కల గ్రామాల రైతులతో ఆయన సమావేశమయ్యారు.
39 మంది రైతుల పొలాలను కలుపుకొని గ్రిడ్ కోసం సుమారు 54 ఎకరాల భూమి అవసరమని ఆయన వివరించారు. భూసేకరణలో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందజేస్తుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ రాములు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Discussion about this post