అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కళ్యాణదుర్గం నియోజకవర్గం తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుకు తృటిలో ప్రమాదం తప్పింది. ప్రచార రథానికి తగిలిన రాళ్లు పక్కకు పడిపోయాయి. ఒక రాయి ప్రచార రథానికి తగిలి.. పక్కనే ఉన్న విద్యార్థి వీరేష్ నుదుటిపై పడటంతో గాయమైంది. దీంతో వెంటనే విద్యార్థికి ప్రథమ చికిత్స అందించారు. రాళ్లదాడి ఘటనతో తెదేపా నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వైకాపా అల్లరి మూకలను పట్టుకునేందుకు ప్రయత్నించడంతో వారు పరారయ్యారు. రాళ్లదాడిలో గాయపడిన విద్యార్థితో పాటు అతడి తల్లిదండ్రులు, తెదేపా నాయకులు కుందుర్పి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఘటనపై ఫిర్యాదు చేశారు.
source : eenadu.net










Discussion about this post