తెదేపా అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ నామినేషన్ ఘట్టానికి తెలుగు సైన్యం కదలివచ్చింది. సైకిల్ గెలవాలి.. సైకో పోవాలి అంటూ నినాదాలు చేస్తూ చంద్రబాబుకు జైకొడుతూ తెలుగు తమ్ముళ్లు ఉత్సాహంగా తరలివచ్చారు. శింగనమల పసుపుమయమైంది. శింగనమల మరువ కొమ్మ నుంచి ద్విసభ్యకమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి, తెదేపా నాయకులు, కార్యకర్తలతో కలిసి స్థానిక పాత మరవ వరకు ర్యాలీగా వచ్చారు. ఆ తర్వాత శ్రావణిశ్రీ ఎడ్ల బండిపై ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.
source : eenadu.net
Discussion about this post