కడప లోక్‌సభ అభ్యర్థిగా ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఈరోజు ఉదయం ఇడుపులపాయ వైఎస్‌ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నామినేషన్ పత్రాలను ఘాట్ వద్ద ఉంచి నివాళులు అర్పించారు. ఆమెతో పాటు ప్రత్యేక ప్రార్థనల్లో బ్రదర్ అనిల్ కుమార్, అక్క డాక్టర్ సునీతా రెడ్డి పాల్గన్నారు. ప్రస్తుత రాజకీయాలన్నింటినీ అర్థం చేసుకోగలరని చెప్పారు. కడప ప్రజలు మంచి తీర్పు ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కడప ప్రజలు వైఎస్‌ఆర్, వివేకాను ఇంకా మరిచిపోలేదన్నారు. తన గెలుపుపై సంపూర్ణ నమ్మకం ఉందని చెప్పారు. అది నిరూపించుకునే సమయం ఆసన్నం అయ్యిందని పేర్కొన్నారు. ఈ యుద్ధంలో భారీ మెజారిటీతో గెలుస్తానని దఅఢమైన నమ్మకం ఉందని ఆత్మవిశ్వాసాన్ని చాటారు.
source : prajasakthi.com
 
	    	 
                                









 
                                    
Discussion about this post