ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ స్థానానికి శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా సాయంత్రం పట్టణంలో చేపట్టిన ర్యాలీకి తెదేపా, భాజపా, జనసేన శ్రేణులు భారీగా తరలిరావచ్చారు. పట్టణంలోని సూగూరు దేవాలయం నుంచి ప్రారంభమైన రోడ్‌షో జనంతో రహదారులు కిక్కిరిశాయి. జనం జేజేలు మధ్య బాలకృఫ్ణ రోడ్‌షో ప్రారభించగా జనం అడుగడుగునా నీరాజనం పట్టారు. వాల్మీకి కూడలిలో మైనార్టీ నాయకులు ప్యారూసాబ్, హిదాయత్ కుటుంబ సభ్యులు గజమాలతో బాలయ్యకు ఘనస్వాగతం పలికారు.
source : eenadu.net
Discussion about this post