ధర్మవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గురువారం నామినేసన్ దాఖలు చేసినట్లు రిటర్నింగ్ ఆఫీసర్ ఎం. వెంకట శివరామిరెడ్డి తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నామినేషన్లు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు స్వీకరించబడునని తెలిపారు. ప్రభుత్వ సెలవు రోజులలో ఉండదన్నారు. నామినేషన్ వేసేవారు 4 సెట్లు వేయవచ్చునని తెలిపారు. అభ్యర్థితో పాటు మొత్తం ముగ్గురికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు.
source : prajasakthi.com
Discussion about this post