తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తరపున ఆయన సతీమణి నారా భువనేశ్వరి శుక్రవారం మధ్యాహ్నం 1.27 గంటలకు కుప్పంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. గురువారం సాయంత్రమే ఆమె కుప్పం చేరుకున్నారు. శుక్రవారం ఉదయం 10.45 గంటలకు ఆమె వరదరాజస్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలను ఉంచి పూజలు చేస్తారు. అనంతరం కుప్పం చెరువుకట్ట నుంచి ర్యాలీగా వెళ్లి మధ్యాహ్నం 1.27గంటలకు నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. కాగా, కుప్పం టీడీపీ శ్రేణులతో చంద్రబాబు గురువారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తన తరఫున భువనేశ్వరి శుక్రవారం నామినేషన్ వేయనున్న నేపథ్యంలో ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను కలిసి తన మాటగా పిలవాలని ఆయన కోరారు.
source : andhrajyothi.com
Discussion about this post