ముఖ్యమంత్రి జగన్‌పై ఉన్నన్ని కేసులు ముంబయి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపైనా ఉండవేమోనని సీబీఐ మాజీ డైరెక్టర్, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఎం.నాగేశ్వరరావు ఎద్దేవా చేశారు. ఆయనకు తెలివి తక్కువై దేశం విడిచి పారిపోయారని, ఇక్కడే ఉండి రాజకీయాల్లో చేరి ఉంటే కచ్చితంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేవారని ఎక్స్ వేదికగా శనివారం ట్వీట్ చేశారు. ‘సీఎం జగన్‌పై 38 క్రిమినల్ కేసులున్నాయి. ఇందులో 11 సీబీఐ నమోదు చేసినవి. 7 ఈడీ దాఖలు చేసినవి. దాదాపు ఇవన్నీ 13 ఏళ్లుగా విచారణ దశలోనే ఉన్నాయి. అంతేకాదు.. 146 నేరాభియోగాల్లో ఆయనే నిందితుడిగా ఉన్నారు. ఇవన్నీ 2019 ఎన్నికల అఫిడవిట్‌లో జగనే స్వయంగా పేర్కొన్నారు. దావూద్ ఇబ్రహీంపై కూడా ఇన్ని కేసులుగానీ, నేరాభియోగాలుగానీ ఉన్నాయా అంటే సందేహమే. ఆయన దేశం విడిచి పారిపోకుండా రాజకీయాల్లో చేరి ఉంటే మహారాష్ట్ర సీఎం అయ్యేవారు. మేరా భారత్ మహాన్’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. జగన్‌పై నమోదైన కేసులు, అభియోగాల జాబితాను ఈ ట్వీట్‌కు జత చేశారు.
source : eenadu.net










Discussion about this post