ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శనివారం నుంచి ‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’ పేరుతో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్డీయే కూటమి అభ్యర్థుల విజయం కోసం రాయలసీమలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఏప్రిల్ 19న హిందూపురం తెలుగుదేశం అభ్యర్థిగా బాలకృష్ణ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈనెల 25 నుంచి ఉత్తరాంధ్రలో ప్రచారం నిర్వహించనున్నారు.
source : eenadu.net
Discussion about this post