ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పబ్లిక్ పరీక్షల ఫలితాలను శుక్రవారం విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రకటించింది. తాడేపల్లిలోని ఇంటర్మీడియట్ విద్యా కార్యాలయంలో ఉదయం 11గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. మార్చి 1 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహించగా.. ఈనెల 4నాటికి జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేశారు. ప్రథమ సంవత్సరానికి సంబంధించి 5,17,617, ద్వితీయ సంవత్సరం 5,35,056 మంది పరీక్ష ఫీజు చెల్లించగా.. వీరిలో 9,99,698 మంది పరీక్షలకు హాజరయ్యారు.ఫలితాలను www.eenadupratibha.net,  https://resultsbie.ap.gov.in  లోనూ పొందొచ్చు.
source : eenadu.net
Discussion about this post