ఉరవకొండ మండలం కోనాపురం చెరువును హంద్రీనీవా కాలువలో ప్రవహించే కృష్ణా జలాలతో నింపాలని కోరుతూ ఆ చెరువు పరిధిలోని రైతులు ఉరవకొండ కోర్టులోని న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించారు.
వారి ఫిర్యాదుపై శనివారం ఆ సంస్థ ఛైర్‌పర్సన్, జూనియర్ సివిల్ జడ్జి దుర్గాకల్యాణి విచారించారు. హంద్రీనీవా ఈఈ రామకృష్ణయాదవ్‌ను రైతుల సమక్షంలో విచారణ చేశారు. ఆ చెరువులో భూగర్భ జలం అడుగంటిపోయి పంటలు ఎండిపోతున్నాయని రైతులు జడ్జికి చెప్పారు.
ఆ చెరువును నింపేవాళ్లమని ఈఈ చెప్పారు. అతనికి పరిహారం తక్కువగా వచ్చిందంటూ నీటి సరఫరాను అడ్డుకుంటున్నాడని తెలిపారు.
Discussion about this post