వాలంటీర్లకు తెదేపా వ్యతిరేకంగా ఉందన్నది అవాస్తవమని వైకాపా నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. రాప్తాడు మండలం, అనంత రూరల్, ఆత్మకూరు, చెన్నేకొత్తపల్లి మండలాల్లో గురువారం ప్రచారం నిర్వహించారు. ప్రసన్నాయపల్లి పంచాయతీ అయ్యవారిపల్లి గ్రామ రైతులకు సంబంధించిన పొలాల్లోకి వెళ్లేందుకు దారి లేదని పరిటాల సునీత దృష్టికి తీసుకుని రాగా సొంత ఖర్చులతో దారి ఏర్పాటు వేయుస్తానని హామీ ఇచ్చారు. పేదలు, వృద్ధులు, వికలాంగుల పింఛన్ల పేరుతో జగన్ కొత్త డ్రామా ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.26 లక్షల మంది సిబ్బంది ఉన్నారని ఇంటింటికీ వెళ్లి రెండు రోజుల్లో మొత్తం పింఛన్లు పంపిణీ ప్రక్రియ పూర్తవుతుందని అలా చేయడం మానేసి తెదేపా విమర్శలు చేస్తే ప్రజలు నమ్మరన్నారు.
ఎన్నికల సమయంలో ప్రజలను వైకాపా నాయకులు బలవంతంగా చేర్చుకున్నా వారు పార్టీలో ఉండలేదని పరిటాల సునీత పేర్కొన్నారు. రంగంపేట గ్రామానికి చెందిన శివారెడ్డి, ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన 10 కుటుంబాలు తెదేపాలోకి చేరాయి. సీకేపల్లికి చెందిన వెంకట్రాముడు, రమాదేవి, బ్రాహ్మణి, రాణి, లక్ష్మీదాస్, రాజు, అవినాష్, ఆత్మకూరుకు చెందిన నారాయణప్ప, పవన్‌లతోపాటు 10 కుటుంబాలు పార్టీలో చేరాయి.
source : eenadu.net
Discussion about this post