ఏప్రిల్ 2న మదనపల్లెలో మేమంతా సిద్దం సభ నిర్వహించనున్నట్లు మంత్రిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మదనపల్లిలో పర్యటించిన ఆయన సభ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో పెద్దిరెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 27న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బస్సు యాత్ర ఇడుపులపాయలో ప్రారంభమైందన్నారు. నంద్యాల, ఎమ్మిగనూరులో మేమంతా సిద్దం సభలు విజయవంతం అయ్యాయన్నారు.
ఏప్రిల్ 2న మదనపల్లెలో 3, 4 తేదీల్లో పూతలపట్టు, నాయుడుపేట మేమంతా సిద్దం సభలు జరుగుతాయన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో బస్సు యాత్ర షెడ్యూల్ ఆలస్యమవుతుందన్నారు. రాబోయే ఎన్నికలకు ఈ సభలు ద్వారా వైఎస్సార్‌సీపీ శ్రేణులకు మంచి ఉత్సాహం లభిస్తుందని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.
source : saksi.com
Discussion about this post