వైఎస్ జగన్ జనంలోంచి వచ్చిన నాయకుడని, అందుకే ఆయన ఎక్కడికి వెళ్లినా జనం నీరాజనాలు పలుకుతున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు నవీన్‌నిశ్చల్ అన్నారు. శుక్రవారం ఆయన హిందూపురం ఎంపీ అభ్యర్థి శాంతమ్మ, మడకశిర అసెంబ్లీ అభ్యర్థి ఈరలక్కప్పతో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘మేమంతా సిద్ధం’ పేరుతో సీఎం జగన్ నిర్వహిస్తున్న బస్సుయాత్రకు విశేష స్పందన లభిస్తోందన్నారు. ప్రొద్దుటూరు, నంద్యాల సభలకు లక్షలాదిమంది ప్రజలు హాజరు కావడమే ఇందుకు నిదర్శనమన్నారు. వైఎస్ జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణచూసి ఓర్వలేక టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కడుపుమంటతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారికి వంతపాడుతూ ఎల్లో మీడియా కూడా బస్సుయాత్రపై తప్పుడు ప్రచారం చేస్తూ రాక్షసానందం పొందుతోందని ధ్వజమెత్తారు. ఈ మూడు పార్టీల నాయకులకు పచ్చ కామెర్ల రోగమన్నారు. వెంటనే వీరిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించాలని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి చిత్తుగా ఓడటం ఖాయమన్నారు. వైఎస్ జగన్‌కే రాష్ట్ర ప్రజలు మళ్లీ పట్టం కడతారని తెలిపారు.
source : sakshi.com










Discussion about this post