టిడిపిాజనసేనాబిజెపి కూటమి నేతలు బుధవారం సమావేశమయ్యారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురందేశ్వరి నివాసంలో బుధవారం ఈ భేటీ జరిగింది. టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు, జనసేన పిఎసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పురందేశ్వరితోపాటు పలువురు బిజెపి నాయకులు ఈ సమావేశంలో పాల్గన్నారు. బిజెపి పోటీ చేసే 10 స్థానాలను బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. టిడిపి చీపురుపల్లి, పాడేరు, భీమిలి, దర్శి, రాజంపేట, ఆలూరు, అనంతపురం, గుంతకల్లు నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. జనసేన పాలకొల్లు, విశాఖ దక్షిణ, అవనిగడ్డ నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
source : prajasakthi.com










Discussion about this post