అభ్యర్థుల కంటే పార్టీ ముఖ్యమని టీడీపీ హిందూపురం ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి పేర్కొన్నారు. కావున నాయకులు, కార్యకర్తల్లో ఏవైనా వ్యక్తిగత విభేదాలుంటే వాటిని విడనాడి, అందరూ కలి సికట్టుగా పనిచేసి పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తద్వారా చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడమే మన ధ్యేయమన్నారు. పెనుకొండలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం టీడీపీ నియోజకవర్గ స్థాయి స మన్వయకమిటీ సమావేశాన్ని బీకే అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో నియో జకవర్గ పరిశీలకుడు డాక్టర్ నరసింహరావు, నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి సవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా బీకే మాట్లాడుతూ… రాబోవు ఎన్నికల కురుక్షేత్రంలో ప్రతి కార్యకర్త ఒక సైనికుడై పోరాడినప్పుడే జగన రాక్షస పాలనను అంతమొందించవచ్చన్నారు. కార్యకర్తల్లో, నాయకుల్లో ఎలాంటి చిన్న అపోహలున్నా వాటిని విడనాడి పార్టీ విజయానికి తప్పకుండా పనిచేయాలన్నారు. నియోజకవర్గంలో కష్టపడే నా య కులు, కార్యకర్తలను పక్కనబెట్టి ఇటీవల కొత్త నాయకులు పుట్టుకొస్తున్నారన్నారు. పార్టీకోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని, వారికి ఎల్లవేళలా అండగా ఉంటానన్నారు. ప్రతి మండలం, గ్రామ పంచాయతీల్లో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసి, వాటి ద్వారానే సభలు, సమావేశాలు, ప్రచారాలు నిర్వహించాలన్నారు. తమ పార్టీ యూజ్ అండ్‌త్రో కాదని, కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. సవిత మాట్లా డుతూ పెనుకొండ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట అన్నారు. ఇక్కడి ప్రజలు పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నంటే ఉన్నారన్నారు. ఈ ఎన్నికల్లో మళ్లీ పెనుకొండలో పార్టీ జెండా రెపరెపలాడాలన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నారు. అనంతరం మండలాలవారీ గా సమావేశం నిర్వహించారు. సమావేశంలో నియోజకవర్గంలోని ఐదు మండలాల కు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరయ్యారు.
source : andhrajyothi.com
Discussion about this post