తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బుధవారం పలమనేరు నుంచి ప్రజాగళం కార్యక్రమంతో ఎన్నికల శంఖారావం కు శ్రీకారం చుట్టనున్నారు. ప్రజాగళం పేరిట పలమనేరు, పుత్తూరు లో ప్రచార సభలు నిర్వహించనున్నారు. పలమనేరులో ఉదయం 11 గంటల నుంచి 12 .30 గంటల వరకు జరిగే కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. 2.30 గంటల నుంచి 4 గంటల వరకు నగరి నియోజకవర్గం పరిధిలోని పుత్తూరులో జరిగే ప్రజాగళం కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 5:30 గంటల నుంచి 7:30 గంటల వరకు మదనపల్లెలో జరిగే ప్రజాగళం కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. రాత్రికి మదనపల్లిలో బస చేస్తారు.
కాగా మంగళవారం రాత్రి కుప్పంలో బస చేసిన చంద్రబాబు బుధవారం నేరుగా పలమనేరుకు చేరుకొని ప్రజాగళం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎక్కడికక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు హాజరవుతారు. అనంతరం అన్నమయ్య జిల్లా మదనపల్లెకు హెలికాప్టర్‌లో బయలుదేరి వెళ్లనున్నారు.
source : andhrajyothi.com
Discussion about this post