తెలుగుదేశం పార్టీకి బడుగు బలహీన వర్గాలు అండగా ఉంటారని, వారిని అణచివేయడమే ముఖ్యమంత్రి జగన లక్ష్యంగా పెట్టుకున్నారని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్‌కుమార్ అన్నారు. పట్టణం లోని టీడీపీ కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. తన సొంత జిల్లాలోని బీసీల భూముల రికార్డులు తారుమారు చేసి, వారి మృతికి కార ణమైన వైసీపీ నేతలపై ఎందుకు చట్టప్రకారం చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. తమ భూములను వైసీపీ నేతలు లాక్కోవడంతో రాజంపేట నియోజకవర్గంలో పాలసుబ్బయ్య, పద్మావతి, వారి కుమార్తెలుజీవనోపాధి లేక చివరకు ఆత్మహత్య లు చేసుకున్నారని అన్నారు. అదేవిధంగా నందం సుబ్బయ్యను హత్యచేసిన వారి పై ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. రాష్ట్రంలో బీసీలకు అండగా ఉండాలని వా రికి అన్నివిధాలా రక్షణ కల్పించాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు బాబు ష్యూరిటీ భవిషత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని తీసుకొచ్చారన్నారు. జగన అక్ర మాలను అవినీతిని అణచివేసేందుకు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పారర్టీని గెలి పించాలని పిలుపునిచ్చారు.
source : andhrajyothi.com
Discussion about this post