తాజా పరిణామాలన్నీ అవుననే చెబుతున్నాయి. పిఠాపురం నుంచి పోటీ చేయడంపై జనసేనాని తర్జనభర్జన పడుతున్నారు. తొలుత అక్కడి నుంచే బరిలో నిల్చుంటానని ప్రకటించి.. రెండ్రోజులు గడవక ముందే ప్లేట్ ఫిరాయించాడు. వరుసగా తగులుతున్న షాక్ నేపథ్యంలో ఎంపీగా పోటీ చేస్తాననే సాకు చూపించి అక్కడి నుంచి బయటపడాలని చూస్తున్నారు.
పవన్ వ్యవహార శైలి కారణంగా పిఠాపురంలో జనసేనకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. కీలక కాపు నేతలందరూ జనసేనను వీడి వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారు. తాజాగా పిఠాపురం జనసేన మాజీ ఇన్‌చార్జ్ మాకినీడు శేషు కుమారి వైఎస్సార్‌సీపీలో చేరారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో శేషుకుమారి పిఠాపురం జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆమె 28వేల ఓట్లు సాధించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌కు సిద్దాంతం లేదు.. నిబద్దత లేదు. జనసేనకి విధివిధానాలు లేవని మండిపడ్డారు.
మరోవైపు.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ముందు నుంచి పిఠాపురంలో బలమైన నేతగా ఉన్నారు. ఈసారి పిఠాపురం టికెట్ తనకే వస్తుందనే ఆశ పెట్టుకున్నారు. కానీ, కూటమి పొత్తులో భాగంగా పిఠాపురంలో పవన్ పోటీ చేస్తానని ప్రకటించడంతో వర్మ, ఆయన మద్దతుదారులు చంద్రబాబు, పవన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు చంద్రబాబు మంతనాల కారణంగా వర్మ కాస్తా చల్లబడ్డారు. కానీ, తాజాగా వర్మ మరో బాంబు పేల్చారు. పిఠాపురంలో పవన్ తప్ప వేరెవరొచ్చినా పల్లకీ మోయనంటూ వర్మ తేల్చి చెప్పారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ పోటీ చేస్తేనే సహకరిస్తానన్నారు. ‘వేరే వాళ్లు పోటీకి దిగితే టీడీపీ నుంచి నేనే పోటీ చేస్తా.. పవన్ ఎంపీగా వెళ్తే నన్ను పోటీ చేయమని చంద్రబాబు చెప్పారు’ అని వర్మ ట్విస్ట్ ఇచ్చారు.
source : sakshi.com
Discussion about this post