తక్షణమే అమల్లోకి ఎన్నికల కోడ్:
ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి తప్పులు అధికారులు చెయ్యరాదుజిల్లా కలెక్టర్ పి అరుణ బాబుపత్రికా ప్రకటన
పుట్టపర్తి, మార్చి 16:
ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా జిల్లా కేంద్రంలో వివిధ పార్టీల ప్రచారాలకు సంబంధించి అనుమతులు లేని హోర్డింగ్లు, బ్యానర్లు, పోస్టర్ల తొలగింపు ప్రక్రియను రేపటి మధ్యాహ్నం మూడు గంటల లోపు పూర్తిగా తొలగించాలని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు శనివారం సాయంత్రం సమయంలో టెలిఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత నియోజకవర్గ ఎన్నికల అధికారులకు, మున్సిపల్ కమిషనర్లకు, ఎంపీడీవోలకు, ఎమ్మార్వోలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డిఆర్ఓ కొండయ్య తో కలిసి టెలిఫోన్ కాన్ఫరెన్స్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు మాట్లాడుతూ జిల్లా అంతట ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి జూన్ 15 వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల లో ఉంటుందని తెలిపారుప్రభుత్వ పథకాలకు సంబంధించిన హోర్డింగ్లు, బ్యానర్లు పూర్తిగా తొలగించాలని తెలిపారుఎన్నికల షెడ్యూల్ వెలువడిన 24 గంటలు లోగా ప్రభుత్వ ఆస్తులపై గల అన్ని రకాల వాల్ రైటింగులు,పోస్టర్లు,కటౌట్లు, హోర్డింగులు,బ్యానర్లు,జెండాలు వంటివన్నీ తొలగించాలని ఆదేశించారు.అలాగే వివిధ పబ్లిక్ ఆస్థులు అనగా బహిరంగ ప్రదేశాలు,బస్ స్టాండ్ లు,రైల్వే స్టేషన్లు,రైల్వే,రోడ్డు వంతెనలు,ప్రభుత్వ బస్సులు, విద్యుత్ స్తంభాలు,మున్సిపల్ సమావేశ ప్రదేశాల్లోని అన్ని రకాల రాజకీయ పరమైన అడ్వర్టైజ్మెంట్లు,వాల్ రైటింగులు,పోస్టర్లు,కటౌట్లు వంటివన్నీటినీ వెంటనే తొలగించాలని ఆదేశించారుఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు అవుతున్నప్పటి నుంచి 24 గంటల లోపే ప్రభుత్వ స్థలాలు, 48 గంటలలోపు ప్రైవేటు ఆస్తులలో వీటిని తొలగించాల్సి ఉందని ఆయన చెప్పారు. జిల్లాలోని వివిధ నగరంలో రోడ్ల కూడలిలో వివిధ రాజకీయ నాయకుల విగ్రహాలకు వస్త్రాలతో ముసుగులు వేసి కప్పి ఉంచాలని తెలిపారు. ప్రభుత్వ శిలాఫలకాలలో శిలాపలకల కనపడకుండా వస్త్రాలతో కప్పి ఉంచాలని ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు రాజకీయ నాయకుల విగ్రహాలను వస్త్రాలతో కప్పి ఉంచాలని ఆయన పేర్కొన్నారు. అన్ని నియోజకవర్గాలలో ఎన్నికలకు సంబంధించిన కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. మండల స్థాయి నియోజకవర్గ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎన్నికల ప్రవర్తన నియమాలు కచ్చితంగా అమలయ్యే విధంగా మీరు చర్యలు చేపట్టాలని తెలిపారు.
జిల్లా కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశాం:
ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు జిల్లా కలెక్టరేట్ లో కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, తక్షణమే దాని సేవలు అందుబాటులోకి వస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు యంత్రాంగం సమాయత్తంగా ఉందని ఉద్ఘాటించారు. ప్రక్రియను పర్యవేక్షించేందుకు క్షేత్ర స్థాయిలో ఎంసీసీ బృందాలు ఉన్నాయని వివరించారు. వ్యయ ఖర్చులు, ప్రకటనలు, ప్రచారాలు, కార్యక్రమాలు ఇతర అంశాలను పరిశీలించేందుకు ఎఫ్.ఎస్.టి, వీఎస్టీ, వీవీటీ, ఎస్.ఎస్.టి. బృందాలు పని చేస్తాయని పేర్కొన్నారు. ప్రకటనల జారీ, ప్రచురణ విషయంలో పాటించాల్సిన నియమాల గురించి ఎంసీఎంసీ కమిటీ తెలియపరుస్తుందని చెప్పారు. ఎన్నికల ప్రచారం, నామినేషన్, ఇతర అంశాలకు సంబంధించి అనుమతులు ఇచ్చేందుకు సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అవిరళ కృషి చేస్తామని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లరాదని, వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి నగదు తీసుకెళ్లాల్సి ఉంటే ముందస్తు అనుమతి తీసుకోవాలని చెప్పారు.
ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్:
రాష్ట్రంలో ఏప్రిల్ 18, 2024న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని తదుపరి అన్ని ప్రక్రియలు మొదలవుతాయని కలెక్టర్ చెప్పారు. మే, 13వ తేదీన పోలింగ్ ఉంటుందని, జూన్ 04న లెక్కింపు ప్రక్రియ ఉంటుందని వివరించారు. నామినేషన్ విత్ డ్రాలు జరగడానికి పది రోజుల ముందు వరకు కొత్త ఓటర్లుగా చేరేందుకు అవకాశం ఉంటుందని, ఇంకా ఎవరైనా ఉంటే ఫారం-6 దరఖాస్తులు సమర్పించుకోవచ్చని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.DIPRO I&PR SSS.DISTRICT 16.3.24.
Discussion about this post