వచ్చే శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శనివారం ప్రకటించనున్నారు. ఈ మేరకు సీఎం ఉదయం 10.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ చేరుకుంటారు. అక్కడ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల అనంతరం మధ్యాహ్నం ఒకేసారి 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారు. అనంతరం ఇడుపులపాయ నుంచి బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు.
ఈ నెల 18 నుంచి ప్రచారాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. వేర్వేరు ప్రాంతాల్లో రోజుకు రెండు లేదా మూడు బహిరంగసభలు, రోడ్ షోలు నిర్వహించేలా ప్రచార ప్రణాళికను రూపొందించారని తెలుస్తోంది. ఓవైపు సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపికపై టీడీపీ–జనసేన–బీజేపీ కూటమిలో అసంతృప్తి జ్వాలలు చెలరేగుతున్నాయి. మరోవైపు వైఎస్సార్‌సీపీ రెట్టించిన ఉత్సాహంతో ప్రచారంలో దూసుకెళ్లే దిశగా అడుగులేస్తోంది.
source : sakshi.com










Discussion about this post