మహిళా సంఘాల సభ్యులు ఆర్థికాభివృద్ధికి ఆర్థిక సహకారం అందిస్తున్నామని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే నివాసంలో గురువారం పట్టణంలోని 56 సమాఖ్య సభ్యులకు రూ.50వేలు చొప్పున మొత్తం రూ.28 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, మున్సిపల్ ఛైర్పర్సన్ కాచర్ల లక్ష్మిల చేతులమీదుగా మహిళలకు పంపిణీ చేశారు. పొదుపు సంఘాల సభ్యులకు మెప్మా సంస్థ రివాల్వింగ్ ఫండ్ కింద అందించే రుణాలను ఏదైనా వ్యాపార రంగాల్లో పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా ఎదగాలని సూచించారు. మహిళలు సమిష్టిగా రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా, సామాజికంగా రాణించాలని సూచించారు.
Discussion about this post