పరిగి, మార్చి 14నేటి భారత్:- భూమి ఉపరితలంపైఅవసరాన్ని బట్టి నిబంధనల ప్రకారం ప్రభుత్వ అనుమతితోమట్టిని తరలించవచ్చు. భూ హక్కు చట్ట ప్రకారంప్రభుత్వానికైనా భూ యాజమాన్యానికైనా కేవలం మూడుఅడుగులు మాత్రమే హక్కు కలిగి ఉంటారు. అంతకుమించిఒక్క అడుగు లోతుకు తవ్వకాలు చేయాల్సి వస్తే కఠినమైననిబంధనలను దాటుకొని వెళ్లాలి, ముఖ్యంగా చెరువుల్లోనూచెరువు పోరంబోకు,వంక పోరంబోకు, ఖాళీ స్థలాలలో మట్టినితరలించకూడదు. అవన్నీ కూడా ప్రభుత్వ రిజర్వుడ్‌భూములు.. ఇన్ని నిబంధనలు ఉన్న పరిగి మండలకేంద్రంలోని చెరువులో మాత్రం చట్టాలను ధిక్కరిస్తూ పరిగిమండలంలోని అన్ని చెరువులలో మట్టి మాఫియా గ్యాంగ్ అద్దుఅదుపు లేకుండా పోతోంది. నిబంధనలు మాకు అడ్డురావంటూ మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నా వైనంపరిగి మండల కేంద్రంలోని చెరువులో కనబడుతోంది. అన్నిరాజకీయ పార్టీ నాయకులు ఇందులో భాగస్వాములే ఒకరిదిజెసిబి, మరొకరిది టిప్పర్, ఇంకొకరిది ట్రాక్టర్ ఎవరిసామర్ధ్వాన్ని బట్టి వారు ఏర్పాటు చేసుకొని “పండడమ్మ” తల్లిసాక్షిగా పరిగి చెరువులో మట్టి తవ్వకాలు నిరంతరం రాత్రిపగలు తేడా లేకుండా మట్టీ తవ్వకాలు సాగిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఆయా నాయకుల ఉదాసీనంగావ్యవహరిస్తున్న తీరుపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.రాత్రి పగలు తేడా లేకుండా ఏకంగా జెసిబి ని ఉపయోగించినీళ్లు ఉన్న చెరువులో మట్టిని తరలిస్తున్నప్పటికీ సంబంధితఅధికారులు అటువైపు కన్నెత్తైనా చూడకపోవడంపైఅధికారులకు కూడా ముడుపులు అందజేస్తున్నారేమో అన్నవిమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది విలేకరుల పాత్రకూడా మధ్యవర్తిత్వం వరకు వెళ్లిందంటే కంచే చేనుమేసినట్లుగా ఉందంటూ స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు.గత వారం రోజులుగా మట్టి మాఫియా యథేచ్చగాకోనసాగుతున్నప్పటికీ చర్యలు తీసుకోకపోవడంతో సంబంధితఅధికారులపై, స్థానిక అధికారులపై ఎన్నో అనుమానాలు. రాత్రి 9:00 దాటితే గ్యాంగ్ స్టార్లు అందరూ ఒక చోటికి చేరిమట్టిదోపిడి కొనసాగిస్తున్నారు. నీటిపారుదల శాఖ రెవెన్యూశాఖ అధికారులైతే వీరి దోపిని అడ్డుకోవడానికి ప్రయత్నంచేయకపోవడంతో లక్షల్లో ముడుపులు అందుతున్నట్లువిమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగాఎన్నికల కోడ్ ఎప్పుడైనా కుయ్యొచ్చు , అంతలోనే దొరికిన కాడికి దోచుకుందామంటూ పోటీపడి దోచేస్తున్నారన్నడంలో అతిశయోక్తి లేదంటూ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. నీళున్న చెరువులో లోయల్ని తలపించే విధంగా గుంతలు పెడుతూ మట్టిని తరలిస్తున్న అధికారులు మాత్రం చర్యలుతీసుకోకపోవడంపై మట్టి మాఫియా గ్యాంగ్ నుప్రోత్సహిస్తున్నది ఎవరు..?అన్నఅనుమానాలు అంతు చిక్కనివైనం. మట్టి తరలించే టప్పుడు పంట పొలాలను సైతంనాశనం చేస్తున్నారని రైతులు లబోదిబోమంటున్న అధికారులుపట్టించుకోకపోవడం సమంజసం కాదని స్థానిక రైతులుఆవేదనవ్యక్తం చేస్తున్నారు… ఏది వమైనప్పటికీ జిల్లా స్థాయి అధికారులుపర్యవేక్షణ చేసి పరిగి చెరువును పరిరక్షించే విధంగా చర్యలుతీసుకోవాలని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు..
Discussion about this post