శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో తాగునీటి సమస్యను పరిష్కరించిన ఘనత ఎమ్మెల్యే బాలకృష్ణదేనని ఆయన సతీమణి వసుంధర పేర్కొన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ సొంత నిధులు, నాట్స్ మాజీ అధ్యక్షుడు.. తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహనకృష్ణ సహకారంతో రూ.40 లక్షల వ్యయంతో చిలమత్తూరు మండలం మొరంపల్లి, కోడూరు, హిందూపురంలలోని ముద్దిరెడ్డిపల్లి, పోచనపల్లిలో ఏర్పాటు చేసిన నీటిశుద్ధి కేంద్రాలను బుధవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దాహార్తిని దృష్టిలో పెట్టుకుని గొల్లపల్లి నుంచి ప్రత్యేక పైప్‌లైన్‌తో హిందూపురం పట్టణానికి నీటిని తీసుకొచ్చారని అన్నారు. నియోజకవర్గంలో బాలకృష్ణ అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ఆదర్శంగా తీర్చిదిద్దడంతో 2014, 2019 ఎన్నికల్లో ప్రజలు అధిక మెజారిటీతో గెలిపించారని.. వచ్చే ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
source : eenadu.net
Discussion about this post