గోరంట్ల (అనంతన్య్యూస్ బ్యూరో) ‘పెనుగొండలో జరిగిన సమావేశంలో టిడిపి అభ్యర్థి సవితమ్మ సమక్షంలో మంత్రి ఉషశ్రీ మొన్నటి రోజున సోమందేపల్లి కి చెందినవారు వెంకటరమణ, రమణ, రమేష్, విజయ్, వెంకటేష్ అలివేళమ్మ, సుబ్బరాయుడు, మోహన్ కృష్ణ వెంకటేష్, నాగప్ప, టీడీపీ నుండి వైసీపీ లోకి చేరగా నేడు తిరిగి వాళ్ళు పెనుకొండ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ ఆధ్వర్యంలో మళ్లీ సొంత గూటిలోకి చేరారు. తెలుగుదేశం పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సవితమ్మ పార్టీలోకి వచ్చిన వారు మాట్లాడుతూ మేము అవసరం నిమిత్తం మంత్రి ఉషశ్రీ దగ్గరకు వెళ్లగా బలవంతపు వైసీపీ కండువాలు వేశారని, వారి ఆత్మీయ పలకరింపు సరిగా లేదని తెలియచేసారు. మేము తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతామని తెలియచేశారు.
Discussion about this post