టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి జగనను గద్దె దింపడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయని, అందరి లక్ష్యం ఒక్కటేనని టీ డీపీ నియోజకవర్గం అభ్యర్థి డాక్టర్ సునీల్‌కుమార్ అన్నారు. ఆయన సోమవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలయిక చారిత్రాత్మక అవసరం అన్నారు. అప్పుల ఆంధ్ర గా మార్చి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిన ఘనత జగనకే దక్కుతుందన్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలపై దాడులను సీఎం జగన మోహనరెడ్డి ప్రోత్సహించారని ఆరోపించారు. బీసీలను అన్ని రంగాల్లో అణగదొక్కారన్నారు. తెలుగు ప్రజల కోసం నవ్యాంధ్ర అభివృద్ధి కోసం టీడీపీ జనసేన, బీజేపీతో కలిసి వెళ్లనున్నట్లు తెలిపారు.
తెలుగుదేశం పార్టీ బీసీ డిక్లరేషన ప్రకటించడం పట్ల మాజీ ఎమ్మెల్యే మద్దనకుంట ఈరన్న, రాష్ట్ర వక్కలిగ కన్వీనర్ వీఎం పాండురంగప్ప తదితరులు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ స్థానిక కార్యాలయం ఆవరణంలో సోమవారం చంద్రబాబు, పవనకల్యాణ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే అన్నారు. తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని ఆనాడే ముద్రవే శా రన్నారు. బీసీల అభ్యున్నతి కోసం టీడీపీ హయాంలో చంద్రబాబు అనేక అభి వృ ద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారన్నారు.
త్వరలో జరుగబోయే ఎన్నికల్లో టీడీపీని ఆదరించి రాష్ట్ర ముఖ్యమం త్రిగా చంద్రబాబును చేద్దామని మాజీ ఎమ్మెల్యే మద్దన కుంట ఈరన్న పేర్కొ న్నారు. మండలంలోని డొక్కలపల్లిలో ఆదివారం రాత్రి పార్టీ మండల కన్వీనర్ కుమార స్వామి, మండల క్లస్టర్ ఇనచార్జ్ శివకుమార్‌తోపాటు నాయకులు, కార్య కర్తలతో ఆయన చర్చించారు. పార్టీలో ఉన్న చిన్నచిన్న భేదాభిప్రాయాలు విడిచి పెట్టి నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.
source : andhrajyothi.com
Discussion about this post