కష్టకాలంలో పార్టీని నడిపించి, కార్యకర్తలను కాపాడుకున్న తనకు చంద్రబాబు ద్రోహం చేస్తారని కలలో కూడా ఊహించలేదని టీడీపీ ఇన్‌చార్జ్ మాదినేని ఉమా మహేశ్వర నాయుడు తన అనుచరులతో వాపోయినట్లు సమాచారం. స్థానిక ఆయన స్వగృహంలో సోమవారం సన్నిహితులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ అధినేత చంద్రబాబుతో తాడో పేడో తేల్చుకుందామన్నారు.
పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులకు కాకుండా డబ్బుకు అమ్ముడుపోయి బడా కాంట్రాక్టర్‌కు టికెట్ ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం తెలిపినట్లు తెలిసింది.అమిలినేనికి సహకరించేది లేదంటూ స్పష్టం చేసినట్లు సమాచారం. త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని, తనకు అండగా నిలవాలని సన్నిహితులను ఉమా కోరారు.
source : sakshi.com










Discussion about this post