వేరుశనగ రైతులను ఆదుకునేందుకు స్థానికంగానే వేరుసెనగ ప్రాసెసింగ్ యూనిట్కు ఏర్పాట్లు చేయనున్నట్లు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని గరుడం పల్లి వద్ద 11 ఎకరాల్లో 77.47 కోట్లతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న వేరుశనగ ప్రాసెసింగ్ యూనిట్కు ఎమ్మెల్యే కేతిరెడ్డి భూమి పూజ చేశారు .అనంతరం ఆయన మాట్లాడుతూ వేరుశనగ పండించే రైతులను దృష్టిలో ఉంచుకొని రైతుల ప్రయోజనాలు కాపాడే విధంగా ప్రభుత్వం ఈ ప్రాంతంలో వేరుశనగ యూనిట్లు నెలకొల్పుతోందన్నారు వేరుశనగ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా చిక్కి, వంటనూనె, వేరుసెనగ, చెక్క తదితర వాటిని తయారు చేస్తారన్నారు.. దీనివల్ల రైతులకు ఎప్పుడైనా గిట్టుబాటు దక్కుతుందన్నారు ఒక్కో పార్లమెంట్ పరిధిలో ఆయా ప్రాంతాల్లో పండే పంటల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా 26 ప్రాసెసింగ్ యూనిట్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.. ఇందుకోసం 3600 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు .వేరుశనగ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా ఈ ప్రాంతంలో రైతులకు మేలు జరగడంతో పాటు 200 మంది ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అన్నారు. ఏడాదిలోపు ఈ యూనిట్ను నిర్మించే విధంగా కాంట్రాక్టర్కు ఆదేశాలు ఇచ్చామన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కామిరెడ్డి సుధాకర్ రెడ్డి ,ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ హెచ్ ఓ అజయ్ కుమార్, డిఇ శ్రీనివాసులు, ఎండి విక్రమ్ తదితరులు పాల్గొన్నారు
Discussion about this post