ముఖ్య అతిథిగా హిందూపురం ఐసిడిఎస్ సిడిపిఓ రెడ్డి రమణమ్మ
శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ డా.కత్తిమండ ప్రతాప్ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన అధ్యక్షులు వడ్డి సుధాకర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు దేమకేతేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చిలమత్తూరు ఎంపీపీ వి.ఎస్ పురుషోత్తమ రెడ్డి హాజరై మహిళా సేవలను కొనియాడి, శ్రీశ్రీ కళావేదిక కార్యక్రమాలను అభినందించారు.వివిధ రంగాల్లో ఎంపిక చేసిన 33 మంది మహిళలను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఈడిగ తిరుమలేష్ ఎంఈఓ పద్మప్రియ సిడిపిఓ రెడ్డి రమణమ్మ ప్రధానోపాధ్యాయులు, జిల్లా కమిటీ సభ్యులు అనిల్ , అశోక్ , శశికళ , ఉపాధ్యాయులు సచివాలయ ఉద్యోగులు అంగన్వాడీ సిబ్బంది వెలుగు సిబ్బంది విద్యార్థులు తల్లిదండ్రులు మహిళలు పాల్గొన్నారు.
Discussion about this post