కర్ణాటక ఆంధ్ర సరిహద్దులో ఉన్న కొడికొండ బోర్డర్ చెక్పోస్టుల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. హిందూపురం డి.ఎస్.పి మంగళవారం సాయంత్రం కోడికొండ చెక్ పోస్ట్ తనిఖీలు నిర్వహించారు. వాహన తనిఖీలు ఏ విధంగా చేపడుతున్నారు, ప్రతి వాహనాన్ని క్షుణంగా తనిఖీ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు నివారించే దిశగా శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు తనిఖీలు చేపట్టి డ్రైవర్లకు, ద్విచక్ర వాహనదారులకు, అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈరోజు సాయంత్రం పోలీస్ అధికారులు సిబ్బంది రహదారులలో విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. అక్రమ రవాణాకు అడ్డుకంటే వేసే విధంగా భద్రతా చర్యలు చేపట్టారు. అక్రమ మద్యం పూర్తిగా అడ్డుకట్ట వేసే విధంగా వాహనాలను క్షుణంగా తనిఖీలు నిర్వహించారు. ప్రధాన రహదారులపై పోలీసులు తనిఖీలు చేపట్టి వాహనదారులకు అవగాహన కల్పించారు.డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా వెళ్లాలని, సూచించారు. అదేవిధంగా విజిబుల్ పోలీసింగ్, నిర్వహించారు.
అక్రమ మద్యం నియంత్రించడానాకి అణువణువు తనిఖీలు నిర్వహించారు.
జిల్లా సరిహద్దుల్లో నిరంతర నిఘా ఏర్పాటు చేసి కర్నాటక నుండీ జిల్లాలోకి ప్రవేశించే ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మహాశివరాత్రి వేడుకల సందర్భంగా జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో శివరాత్రి పండుగ రోజున జరిగే వేడుకలకు దేవాలయాల్లో ఆలయ కమిటీ వారితో మాట్లాడి బందోబస్తు ఏర్పాట్లకు సిద్ధం చేస్తున్నారు.
పోలీసు అధికారులు గ్రామాలలో ఎన్నికల సమీపిస్తున్న వేళ పరిస్థితులను ప్రజలకు అవగాహన కల్పించి, ప్రశాంతంగా జీవించాలని సూచించారు. అపరిచిత వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసుల సమాచారం ఇవ్వాలని తెలియజేశారు.
Discussion about this post